Harishrao: రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుండగా ,ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది.

Harishrao: రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
harishrao(X)

Hyd, July 26: తెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుండగా ,ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది.

అయితే రుణమాఫీ అమలు ప్రక్రియలో రైతులను బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బ్యాంకర్లు వడ్డీ కోసం రైతులను వేధిస్తున్నారని ఆధారాలను బయటపెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి రైతులు తనకు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నా, పరిష్కరించాలని @TelanganaCMOను కోరారు హరీష్‌ రావు. కార్గిల్ వార్, ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర, యుద్ధం ఎలా ప్రారంభమైంది?,ఎలా ముగిసింది?,జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీ ని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Here's Tweet:

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Jul 26, 2024 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).