Weather Forecast in TS: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, రానున్న 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, వికారాబాద్‌ను ముంచెత్తిన వడగండ్ల వాన

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.

Weather Forecast in TS: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, రానున్న 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, వికారాబాద్‌ను ముంచెత్తిన వడగండ్ల వాన
Rainfall -Representational Image | (Photo-ANI)

Hyd, Mar 16: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షం( rain ) కురిసింది. మ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో వ‌డ‌గండ్ల వాన( Hailstorm ) ప‌డింది. వికారాబాద్, ప‌రిగి, పూడూరు మండ‌లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. గ‌త వారం ప‌ది రోజుల నుంచి ఎండ‌లు మండిపోతున్న క్ర‌మంలో ఇవాళ వ‌ర్షాలు కురియ‌డంతో ప్ర‌జ‌లు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు.

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముసురుపట్టి ఉరుములు ఉరిమాయి. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. నగరాన్ని పూర్తిగా చీకటి కమ్మేసినట్లుగా మేఘాలు ఆవరించాయి.

వీడియో ఇదిగో, వికారాబాద్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం, రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

రానున్న 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.ఈ కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

(The above story first appeared on LatestLY on Mar 16, 2023 02:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).