Karimnagar Shocker: కట్టుకున్న భార్య ఎదురింటి కుర్రాడితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది, కానీ అంతలోనే మనస్థాపం చెందిన భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు...
ఓ వివాహిత ఎదురింటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు.
కరీంనగర్, మార్చ్ 22: ఓ వివాహిత ఎదురింటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన గంగాధర్ (35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్లి జరిపించింది. వీరికి ఒక సంతానం కాగా తిరుపతమ్మ పెళ్లయిన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గంగాధర్ పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు.
పెళ్లి జరిగి, ఆరేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జేరిపోతుల అభిషేక్ అనే ఎదురింటి యువకుడితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా మమత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్‌తోపాటు అతని కుటుంబసభ్యులను మందలించాడు.
ఈ నెల 11న మమత తన ప్రియుడితో శృంగారం చేస్తూ భర్త గంగాధర్‌కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి, తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యులు తమను చంపేస్తామని బెదించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు మమత, అభిషేక్‌లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే దేవమ్మ తన కుమారుడి మృతికి అభిషేక్ తల్లి లక్ష్మి, తండ్రి కిష్ఠయ్య, జేరిపోతుల రాకేశ్, మహేశ్, శంకర్, అతని భార్య అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ప్రకాశ్ బాధితుల ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు.
(The above story first appeared on LatestLY on Mar 22, 2022 11:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

