Kolkata, Mar 22: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడి చల్లారడం లేదు. తాజాగా రాష్ట్రంలోని బీర్ భూమ్ జిల్లాలో రాజకీయ హత్యకు ప్రతీకారంగా కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు బయటనుంచి తాళాలు వేసి (houses set afire for revenge) నిప్పంటించారు.
ఇళ్లను దహనం చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాకు చెందిన ఏడుగురు (7 people die in Birbhum) మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించారని స్థానిక వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌లో దారుణం, హిందూ యువతిని కాల్చివేసిన దుండుగుడు, కిడ్నాప్ ప్రయత్నాన్ని యువతి ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడిన అగంతకుడు
బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్‌లో టీఎంసీకి చెందిన పంచాయితీ నాయకుడు భాదు ప్రధాన్‌పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేశారు. బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుల బృందం ఐదు ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించారు.ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్, అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు చేరుకున్నారు.