Human Sacrifice: నేడు అమావాస్య, సూర్యగ్రహణం... హైదరాబాదులో యువకుడి నరబలి!... కేపీహెచ్ బీలో క్షుద్రపూజల కలకలం.. శ్మశాన వాటిక వద్ద కాలిన స్థితిలో మృతదేహం.. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
టెక్నాలజీ ఫలాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్న నేటి కాలంలో నగరాల్లో క్షుద్రపూజల వంటి అనాగరిక ఆచారాలు కొనసాగుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా, హైదరాబాద్ కేపీహెచ్ బీ లో క్షుద్రపూజల కలకలం రేగింది.
Hyderabad, October 25: టెక్నాలజీ (Technology) ఫలాలు మారుమూల గ్రామాలకు (Villages) కూడా చేరుతున్న నేటి కాలంలో నగరాల్లో క్షుద్రపూజల (Black Magic) వంటి అనాగరిక ఆచారాలు కొనసాగుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా, హైదరాబాద్ కేపీహెచ్ బీ లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఇక్కడి హైదర్ నగర్ లో ఓ యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. స్థానికులు శ్మశాన వాటిక వద్ద ఈ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతదేహం పడివున్న ప్రదేశానికి దగ్గర్లో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించడంతో ఇది నరబలి అయ్యుంటుందని భావిస్తున్నారు.
నేడు అమావాస్య కావడం, ఇదే రోజున సూర్యగ్రహణం సంభవిస్తుండడంతో యువకుడిని బలి ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన ఆ యువకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
(The above story first appeared on LatestLY on Oct 25, 2022 09:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

