Hyd,july 25: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. సంతోష్ నగర్‌లో పాఠశాలకు వెళ్లే చిన్నారులపై ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కథనం వివరాల ప్రకారం.. మొయిన్ బాగ్‌లో ఓ ప్రైవేట్ స్కూలు ఉంది. ఈ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈమె కుమారుడు (Hyderabad school principal's son) యాసర్ పాఠశాలకు వచ్చే చిన్నపిల్లలపై లైంగికదాడికి పాల్పడ్డారు.
ప్రిన్సిపాల్ తన తల్లి కావడంతో చిన్నారులను బెదిరించి అఘాయిత్యానికి (sexually assaulting) పాల్పడ్డాడు. ఈ తంతు చాలా కాలంగా జరుగుతూ వచ్చింది. అయితే, బాధిత చిన్నారుల్లో ఓ చిన్నారి తాను ఎదుర్కొన్న పరిస్థితిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఐపీసీ 354(ఏ), 209, 9(ఎం), ఫోక్సో చట్టం 2012 నుంచి కేసులు నమోదు చేసి అరెస్టు (principal's son arrested) చేశారు. ఆ నిందితుడి నుంచి న్యూడ్ వీడియాలను స్వాధీనం చేసుకున్నారు.