Hyderabad Shocker: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి విషం తాగి తల్లి ఆత్మహత్య, మరో చోట పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ లో శుక్రవారం విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లకు విషమిచ్చి ఉరి వేసుకుని జ్యోతి అనే మహిళప్రాణాలు తీసుకుంది. మృతురాలి పిల్లలను అర్జున్(04), ఆదిత్య(02)గా గుర్తించారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి విషం తాగి తల్లి ఆత్మహత్య, మరో చోట పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
Representational image (Photo Credit- Pixabay)

Borabanda, Oct 13: హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ లో శుక్రవారం విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లకు విషమిచ్చి ఉరి వేసుకుని జ్యోతి అనే మహిళప్రాణాలు తీసుకుంది. మృతురాలి పిల్లలను అర్జున్(04), ఆదిత్య(02)గా గుర్తించారు.

మృతురాలు బంజారాహిల్స్ లోని పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. జ్యోతి భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బోరబండ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జ్యోతి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రాణాలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

బోయిన్‌పల్లిలో దారుణం, ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య, అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు

నిన్న రాత్రి సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవానీ నగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ చారి (42) అనే వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బోయిన్పల్లికి చెందిన శ్రీకాంత్ చారి (42)కి భూదాన్ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. శ్రీకాంత్ సిల్వర్ పని చేస్తుండగా, వీరికి స్రవంతి (8), శ్రావ్య (7) అనే ఇద్దరు పిల్లలున్నారు. రోజూ మాదరిగానే కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. ఉదయం భార్య లేచి చూడగా, పిల్లలతో సహా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు.

దీంతో ఆమె తన అత్త జయమ్మకు విషయం చెప్పింది.అయితే, దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. భార్య అక్షయపై అనుమానం వ్యక్తం చేస్తుండగా, కుటుంబ కలహాలు లేదా ఆర్థిక వ్యవహారాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 13, 2023 10:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).