Hydra Commissioner Ranganath condemns the fake news on notices to Jagan lotus pond

Hyderabad, Sep 3: సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) (HYDRA) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ (AV Ranganath) కు మరో కీలక బాధ్యతలు అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌ గా రంగ‌నాథ్‌ ను నియ‌మిస్తార‌ని స‌మాచారం. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఈ బాధ్య‌త‌ల‌ను హెచ్ఎండీఏ క‌మిష‌నర్ నిర్వ‌హిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం హైడ్రాను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ కూల్చివేతల్లో కొత్త కోణాన్ని చూపించి రియల్ హీరోగా ఏవీ రంగనాథ్ ఇటీవలి కాలంలో ట్రెండ్ సెట్ చెయ్యడం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఎందుకంటే?

హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల ప‌రిధిలో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌ను కూడా హైడ్రా కింద‌కు తేవ‌డం ద్వారా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్ర‌భుత్వం ఆలోచ‌న‌. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌ గా రంగ‌నాథ్‌ ను నియ‌మిస్తార‌ని సమాచారం.

ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు