#HappyBirthdayKTR: హ్యాపీ బర్త్‌డే తారక్, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

తెలంగాణ యువనేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు నేడు. జులై-24తో కేటీఆర్ 44వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు (#HappyBirthdayKTR) తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

#HappyBirthdayKTR: హ్యాపీ బర్త్‌డే తారక్, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
AP CM YS Jagan and TS minister KTR (Photo-Twitter)

Hyderabad, July 24: తెలంగాణ యువనేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు నేడు. జులై-24తో కేటీఆర్ 44వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు (#HappyBirthdayKTR) తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘సోదరుడు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు (KTR Birthday). దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి’ అని ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైక్‌లు, షేర్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అభిమానులు కేటీఆర్-జగన్ కలిసున్న ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేటీఆర్ సీఎం జగన్ ట్వీట్ కు ధ్యాంక్స్ అన్నా అంటూ రిప్లయి ఇచ్చారు.

Here's AP CM Wishes Tweet

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ చిలుకూరు బాలాజీ స్వామిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ కూడా చాలా ధన్యవాదాలు అన్న అంటూ రిప్లయి ఇచ్చారు. ఇక గంటా శ్రీనివాసరావు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్ఫూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలి అని ఆకాంక్షించారు.

Here's KTR  Birthday Wishes Tweets

కాగా శుక్రవారం కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి, కేటీఆర్‌ బావ హరీష్‌ రావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు కేటీఆర్‌ను విష్‌ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, సినీ హీరో మహేష్ బాబు, సీఎం రమేష్ ఇంకా పలువురు ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Here's KTR  Birthday Wishes Tweets

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..' హ్యాపీ బర్త్ డే డియర్ తారక్... ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో మీరు చూపించే చొరవకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మున్ముందు మరింతమందికి మీ సహాయ సహకారాలు అందేలా మరింత శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.' అని ట్వీట్ చేశారు.

Here's KTR  Birthday Wishes Tweets

కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో #GiftAsmile అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వెలిగించాలని... అదే కేటీఆర్‌ బర్త్ డేకి మనమిచ్చే నిజమైన గిఫ్ట్ అని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

(The above story first appeared on LatestLY on Jul 24, 2020 12:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).