L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.
Hyderabad, Nov 5: మేడిగడ్డ (Medigadda) లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. తాజాగా, ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ (L and T) ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. ఆనకట్ట పునరుద్ధరణ పనులకు సంబంధించి శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించామని, ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.
ఐదు వరద సీజన్లను ఎదుర్కొన్న ప్రాజెక్టు
ఇప్పటి వరకు ఐదు వరద సీజన్లను ఈ ప్రాజెక్టు ఎదుర్కొందని చెప్పింది. ఈ అంశాన్ని ప్రస్తుతం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, విచారణ, చర్చ దశల్లో ఉందని పేర్కొంది. తదుపరి కార్యాచరణపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చాక తాము దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాము ప్రభుత్వం డిజైన్, నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిర్మించి 2019లో అప్పగించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
(The above story first appeared on LatestLY on Nov 05, 2023 06:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

