Bangalore, NOV 04: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌పై 21 పరుగుల (DLS) తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో పాక్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాక్ విజయం ఆ జట్టును పాయింట్ల పట్టికలో ఐదో స్థానానాకి చేర్చడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. మరి పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఈ విజయం సరిపోతుందా..? ఇంకా ఏం చేయాలి..?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా సౌతాఫ్రికా (South Africa) రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (Ausis) కూడా ఆరు మ్యాచ్‌లలో (ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ కాకుండా) నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది. ఎటొచ్చి నాలుగో స్థానంతోనే అసలు సమస్య. కివీస్ 8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి నాలుగింటిలో ఓడింది. పాకిస్తాన్ కూడా 8 ఆడి నాలుగు గెలిచి నాలుగు ఓడింది. కానీ న్యూజిలాండ్ (New Zealand) నెట్ రన్ రేట్ (+0.0398).. పాకిస్తాన్ (+0.036) కంటే మెరుగ్గా ఉంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. పాకిస్తాన్ తమ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉండగా కివీస్.. శ్రీలంకతో తలపడనుంది.
Pakistan’s best scenario to qualify for the semis is:
Pakistan beat England
Sri Lanka beat New Zealand
AFG lose one game & their NRR stay low
If it's a tie on NRR with NZ
Pakistan will need to beat England by approx. 130 runs (that's assuming NZ beat SL by 1 run).
— Mazher Arshad (@MazherArshad) November 4, 2023
పాకిస్తాన్ (Pakistan) సెమీ ఫైనల్స్ చేరాలంటే ఆ జట్టు విజయంతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంది. లంక గనక కివీస్‌ను ఓడించడమో లేక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే అది పాకిస్తాన్ నెత్తిమీద పాలు పోసినట్టే. లంక విజయంతో పాటు పాకిస్తాన్ తమ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాలి. అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల చేతిలో ఓడిపోవాలి.
ఒకవేళ న్యూజిలాండ్.. లంకపై 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిస్తే అప్పుడు పాకిస్తాన్.. ఇంగ్లండ్‌ను 180 పరుగుల తేడాతో ఓడించాలి. అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఓడి.. పాకిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడిస్తేనే బాబర్ గ్యాంగ్ సెమీస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే పాక్ భవితవ్యం ప్రస్తుతానికి లంక చేతిలో ఉంది. మరి లంకేయులు పాకిస్తాన్‌ను ఆదుకుంటారో లేక తమతో పాటు బంగాళఖాతంలో ముంచుతారో తెలియాలంటే ఈనెల 9 వరకూ ఆగాల్సిందే. అదే తేదీన పాక్-కివీస్ మ్యాచ్ జరిగిన బెంగళూరు వేదికగానే శ్రీలంక.. న్యూజిలాండ్‌ను ఢీకొననుంది.