Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం

నేడు చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్‌లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఇనిస్టిట్యూట్ తెలిపింది.

Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం..  హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం
File: Google

Hyderabad, Nov 8: నేడు చంద్రగ్రహణం (Lunar Eclipse) కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ(Temples) మూతపడ్డాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో (States) సంపూర్ణంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా (Partial) కనిపిస్తుంది. ఇక హైదరాబాద్‌లోనూ (Hyderabad) గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఆర్కియాలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (జీపీబీఏఏఎస్ఆర్ఐ) తెలిపింది.

హనీ ట్రాప్ లో చిక్కుకున్న యువ క్రికెటర్.. జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లిన ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కందపాల్.. డేటింగ్ సైట్ లో కొందరు వ్యక్తులు పరిచయం.. అందమైన అమ్మాయిల పేరిట క్రికెటర్ కు ఎర.. అభ్యంతరకర వీడియోల పేరిట బ్లాక్ మెయిలింగ్

చంద్రగ్రహణాన్ని నేరుగా వీక్షించవచ్చని, ఇందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం కావడం గమనార్హం. ఈ చంద్రగ్రహణం ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై, హైదరాబాద్‌, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.

(The above story first appeared on LatestLY on Nov 08, 2022 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).