Hyderabad, June 20: హైదరాబాద్ (Hyderabad) నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్లైన్స్ కు (Malaysian Airlines) చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. గురువారం వేకువజామున ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు.
Plane's Right Engine Caught Fire | Hyderabad to Kuala Lumpur | విమానం కుడివైపు ఇంజిన్లో మంటలు
— ETVTelangana (@etvtelangana) June 20, 2024
కాసేపు గాల్లో చక్కర్లు
ఈ క్రమంలో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు అనుమతి రావడంతో చివరకు విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.