CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం

మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్ విధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం
March deadline for Shamirpet Metro DPR says cm Revanth Reddy(X)

Hyd, January 8:  రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం - ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్‌ - శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యార‌డైజ్ - మేడ్చ‌ల్ మెట్రో (23 కి.మీ.) మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాలన్నారు. మేడ్చ‌ల్ మార్గంలో ఎన్‌హెచ్ మార్గంలో ఇప్ప‌టికే ఉన్న మూడు ఫ్లైఓవర్ల‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలి. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రారంభించాలి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే? 

శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాలి. అక్క‌డ అధునాతన వ‌స‌తులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాలన్నారు. జంక్ష‌న్‌కు సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయాలి. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాలన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 08, 2025 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).