Hyderabad, Jan 8: హైడ్రా (HYDRA) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న బుద్ధ భవన్ బీ-బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల
స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి
హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని… pic.twitter.com/bbEo3X2IXj
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
హైడ్రా ఏర్పాటు ఇలా..
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరించారు. చెరువులు, ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో 374 బీ సెక్షన్ ను చేర్చారు.