Visakhapatnam, Jan 8: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో (Visakha) పర్యటించనున్నారు (Visit). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని మోదీ విశాఖ రోడ్ షో షెడ్యూల్ ఇదే | PM Modi Visakha Road Show Schedule - TV9#pmmodi #visakhapatnam #vizag #bjp #tdp #appolitics #andhrapradesh #tv9telugu pic.twitter.com/Mbr4Y6aGlV
— TV9 Telugu (@TV9Telugu) January 8, 2025
భారీ సభ ఇలా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ సభకు 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉంటారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అనువదిస్తారు.
శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి! స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం
గెలిచాక తొలిసారి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మోదీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు..
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
టూర్ షెడ్యూల్ ఇలా..
- బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు.
- సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు.
- సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు.
- సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్ కు వెళ్తారు.