Talasani on Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Talasani on Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani Srinivas Yadav (Photo-TRS Offcie)

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తలసాని పరోక్షంగా మండిపడ్డారు. పిసికితే ప్రాణం పోతుంది... నా కొడుకు... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నిన్న ఆమె (ప్రియాంక) వచ్చింది. ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ పొట్టి వాడు డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడి నోటికి అడ్డు అదుపు లేదు. ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు... వాడు అందరి గురించి వాడు వీడు అని మాట్లాడతాడు. ఇంత లేడు... వాడి పర్సనాలిటీ ఎంత... వాడెంత? పిసికితే ప్రాణం పోతుంది... నా కొడుకు... వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు" అంటూ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు.

Here's Video

(The above story first appeared on LatestLY on May 09, 2023 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).