Telangana: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్ల‌పై ప‌లు డిమాండ్లు..లేక‌పోతే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ మొద‌లు పెడ‌తామంటూ హెచ్చ‌రిక‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల కొనుగోలుపై పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్ల‌పై ప‌లు డిమాండ్లు..లేక‌పోతే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ మొద‌లు పెడ‌తామంటూ హెచ్చ‌రిక‌
cm revanth reddy

Hyderabad, May 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల కొనుగోలుపై పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. వానలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా అది అమలు కావడం లేదని చెప్పారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని అన్నారు.

 

రైతులకు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

మిగిలిన రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరామని అన్నారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. దేశంలో పదేళ్లుగా బీజేపీ సుస్థిర పాలనను అందిస్తోందన్నారు.

(The above story first appeared on LatestLY on May 18, 2024 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).