Munugode Bypoll 2022: పోటెత్తిన ఓటరు.. మునుగోడులో ముగిసిన పోలింగ్.. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదు.. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ..
మునుగోడులో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ.
Munugode, Nov 4: మునుగోడులో (Munugode) పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ (Polling) కొనసాగింది. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో (Elections) నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాగా మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805.
గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. ప్రచారం పర్వంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
(The above story first appeared on LatestLY on Nov 04, 2022 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

