PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు ఇవిగో, జూలై 8న వరంగల్‌లో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు ఇవిగో, జూలై 8న వరంగల్‌లో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
PM-Narendra-Modi-Speech

Hyd, June 29: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.

వరంగల్ టూర్ లో భాగంగా.. అధికార కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతలను ఆదేశించారు. దీంతో కార్యకర్తలు, నేతలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యాశాఖ కార్యాలయాల్లో జీన్స్,టీషర్ట్ పై నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న బీహార్ విద్యాశాఖ

అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార కార్యక్రమాలతోపాటు, బహిరంగ సభకు కాషాయ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నాయకత్వ మార్పు, బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి, కిషన్‌ రెడ్డికి తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అటు హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన మీటింగ్ వాయిందా పడింది. జులై 8వ తేదీన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉందనుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రధాని వరంగల్ పర్యన సందర్భంగా వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ మీటింగ్ కు సంబంధించి ఎప్పుడు, ఎక్కడా నిర్వహిస్తారని ఎలాంటి సమాచారం లేదు. అంతకుముందు ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీకి సంబంధించి పలు విషయాలను చర్చిస్తామని తెలిపారు.

10.6 మిలియన్లకు చేరుకున్న ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు, వరుసగా రెండోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు

మరోవైపు బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్‌ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రావల్సిన షెడ్యూల్ కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతారని అనుకున్నారు. ఇప్పటికే భోపాల్‌లో జరిగిన ‘మేరా పోలింగ్‌ బూత్‌… సబ్‌సే మజ్బూత్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు తాజా షెడ్యూల్ తో వారి పర్యటన కూడా వాయిదా పడొచ్చని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Jun 29, 2023 08:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).