Hyderabad: పంజాగుట్ట స్పా సెంటర్‌లో 20 మంది యువతులతో వ్యభిచారం, మాటు వేసి పట్టుకున్న పోలీసులు, నిర్వాహకులతో పాటు, విటులు అరెస్ట్

పంజగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

Hyderabad: పంజాగుట్ట స్పా సెంటర్‌లో 20 మంది యువతులతో వ్యభిచారం, మాటు వేసి పట్టుకున్న పోలీసులు, నిర్వాహకులతో పాటు, విటులు అరెస్ట్
Credits: Twitter

Hyd, April 5: పంజగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్‌ పోలీసులు పంజగుట్ట పోలీసుల సహకారంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ముందస్తు చర్యగా అరెస్టు చేశామని తెలిపిన పోలీసులు, హైకోర్టులో రేపు విచారణకు పిటిషన్

వ్యభిచారం కేంద్రం నిర్వాహకులు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అక్షయ్‌ అలియాస్‌ వినయ్, అదే ప్రాంతానికి చెందిన సబ్‌ ఆర్గనైజర్‌ ఆర్‌.శృతి, అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 20 మంది యువతులను కాపాడారు. విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 05, 2023 04:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).