Puppalaguda Murder Case: పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు, ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న మరో ప్రియుడు, కోపం తట్టుకోలేక దారుణంగా..
హైదరాబాద్ నార్సింగి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట వద్ద సంచలనం రేపిన పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
Hyd, Jan 15: హైదరాబాద్ నార్సింగి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట వద్ద సంచలనం రేపిన పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్‌కు వివాహిత బిందూతో గత పరిచయం ఏర్పడింది. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.
అనంతరం, అక్కడ వారు ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్‌కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. ఈ నేపథ్యంలో మరో ప్రియుడు వీరిద్దరినీ అక్కడ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై ప్రియుడు దాడి చేసి బండరాళ్లతో మోది హత్య చేశాడు. అయితే ఈ దృశ్యం చూసిన సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్‌ను పట్టుకుని తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు.
హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. వీరిని హత్య చేసేందుకు హంతకుడికి మరెవరైనా సహకరించారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది.
(The above story first appeared on LatestLY on Jan 15, 2025 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

