TS COVID Status: తెలంగాణలో రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లు, తొలి విడత విజయవంతమైందన్న ఆరోగ్య శాఖ, రాష్ట్రంలో కొత్తగా మరో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఇప్పటివరకు హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ చేశారు. టీకాలు వేసుకోని వారికి అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించి తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు....

TS COVID Status: తెలంగాణలో రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లు, తొలి విడత విజయవంతమైందన్న ఆరోగ్య శాఖ, రాష్ట్రంలో కొత్తగా మరో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
COVID-19 Vaccine (Photo Credits: Twitter)

Hyderabad, February 3: తెలంగాణలో మొదటి విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ విజయవంతమైందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు, ఇప్పటివరకు హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ చేశారు. టీకాలు వేసుకోని వారికి అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించి  తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ జరగనుంది.

ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే,  నిన్న రాత్రి 8 గంటల వరకు 40,203 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 185 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1630 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,94,924కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 13 మరియు మేడ్చల్ నుంచి 12 మరియు కరీంనగర్ జిల్లా నుంచి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,604కు పెరిగింది. అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 197 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,91,312 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,008 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది

(The above story first appeared on LatestLY on Feb 03, 2021 10:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).