Telangana's COVID Bulletin: తెలంగాణలో కొత్తగా మరో 2,043 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 67 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1016కు పెరిగిన కరోనా మరణాలు
జిల్లాల్లో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది, ముఖ్యంగా పల్లెల్లో కరోనావైరస్ విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమకేమి సోకదు అనే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి.....
Hyderabad, September 18: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 50,634 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,043 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,039 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,79,950 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,67,046కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 314 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 174, మేడ్చల్ నుంచి 144 కేసులు నిర్ధారణయ్యాయి.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1016 కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1802 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,35,357 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Sep 18, 2020 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

