Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,479 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 916కు పెరిగిన కరోనా మరణాలు
ఇక కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ అర్బన్ నుంచి కూడా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ వంద దాటాయి. యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు, తమకేం అవుతుందిలే అని నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. తాము కరోనా బారినపడి మిగతా వారికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారు....
Hyderabad, September 9: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 62,649 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,479 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 2,430 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,90,554 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,47,642కి చేరుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నప్పటికీ గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 322 పాజిటివ్ కేసులు రికార్డ్ చేయబడ్డాయి. మేడ్చల్ మరియు రంగారెడ్డి పరుధుల్లో కూడా కరోనావైరస్ విజృంభన కొనసాగుతుంది. మేడ్చల్ నుంచి కొత్తగా మరో 183 అలాగే రంగారెడ్డి నుంచి మరో 188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 916 కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 2,485 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,15,072 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Sep 09, 2020 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

