Secunderabad Girls Hostel: బాత్రూం నుంచి గర్ల్స్ పీజీ హాస్టల్ లోకి రాత్రిపూట చొరబడిన దుండగులు.. ఒకడిని పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు.. సికింద్రాబాద్ లో కలకలంరేపిన ఈ ఘటనలో తర్వాత ఏమైంది?? (వీడియోతో)
సికింద్రాబాద్ లోని పీజీ గర్ల్స్ హాస్టల్ లోకి అగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. బాత్రూం కిటికీ నుంచి దుండగులు రహస్యంగా లోనికి చొరబడ్డారు. అనంతరం విద్యార్థినులకు అభ్యంతరకరమైన సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా దుండగుల్లో ఒకరిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు.
Secunderabad, Jan 27: సికింద్రాబాద్ లోని పీజీ గర్ల్స్ హాస్టల్ (Secunderabad Girls Hostel) లోకి అగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. బాత్రూం కిటికీ (Bathroom) నుంచి దుండగులు రహస్యంగా లోనికి చొరబడ్డారు. అనంతరం విద్యార్థినులకు అభ్యంతరకరమైన సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా దుండగుల్లో ఒకరిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు. మొత్తం ముగ్గురు యువకులు లోపలికి చొరబడినట్టు విద్యార్థినులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Hyderabad : సికింద్రాబాద్ ఉమెన్స్ హాస్టల్ లో చొరబడ్డ ఆగంతకుడు - TV9#hyderabad #secunderabad #womenhostel #tv9telugu pic.twitter.com/rDlHPvau4P
— TV9 Telugu (@TV9Telugu) January 27, 2024
అమ్మాయిల ఆందోళనలు
హాస్టల్ లో తమకు రక్షణ కరువైందని, వెంటనే సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని అమ్మాయిలు డిమాండ్ చేశారు. హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
(The above story first appeared on LatestLY on Jan 27, 2024 09:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

