Cash For Vote Case:  ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, హైకోర్టులోనే దీన్ని పరిష్కరించుకోవాలంటూ కేసు క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు 

ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ చేపట్టింది.

Cash For Vote Case:  ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, హైకోర్టులోనే దీన్ని పరిష్కరించుకోవాలంటూ కేసు క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు 
Supreme Court. (Photo Credits: Wikimedia Commons

ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ చేపట్టింది.

హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున ఇకపై ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌‌పై తదుపరి నిర్ణయం హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి... విచారణను ముగిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి ధర్మాసనం ప్రకటించింది. దీంతో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో జరుగనుంది.

వీడియో ఇదిగో, నేను తెలంగాణ వస్తే కేసీఆర్ నన్ను కలిసేందుకు ధైర్యం చేయడం లేదు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి స్వయంగా స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదుతో ప్రలోభాలకు గురిచేసిన వీడియో గతంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో నేడు సుప్రీంలో విచారణకు వచ్చింది.

(The above story first appeared on LatestLY on Oct 03, 2023 09:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).