TS Cabinet Meet Highlights: నూతన రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

పాత సెక్రెటేరియట్ భవనం కూల్చివేతతో పాటు కొత్త సచివాలయ నిర్మాణాలకు అయ్యే ఖర్చులు, జిల్లా ఆఫీసులకు నిధుల కేటాయింపు, ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయో పరిమితి పెంపు మరియు బిసి కమీషన్ చేసిన సిఫారసులు, ఇతర ఆర్డినెన్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది....

TS Cabinet Meet Highlights: నూతన రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Telangana Cabinet Meet | File Photo

Hyderabad, September 7: తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు సమావేశాలు ముగిసిన తర్వాత సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయింది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర కీలక బిల్లులపై ఈ సమావేశంలో మంత్రి వర్గం చర్చించింది.

ఈ సందర్భంగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినేట్, పాత సెక్రెటేరియట్ భవనం కూల్చివేతతో పాటు కొత్త సచివాలయ నిర్మాణాలకు అయ్యే ఖర్చులు, జిల్లా ఆఫీసులకు నిధుల కేటాయింపు, ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయో పరిమితి పెంపు మరియు బిసి కమీషన్ చేసిన సిఫారసులు, ఇతర ఆర్డినెన్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం తీసుసుకోనున్నారు.

కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి

 

• తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020ని ఆమోదం, తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది

• ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది

• ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది

• తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది

• పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ - గ్రామ పంచాయత్స్ - ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు - 2018 సవరణ బిల్లును ఆమోదించింది

• తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది

• తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది

• ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదించింది

• ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002ని ఆమోదించింది

• ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది

• టిఎస్ బిపాస్ బిల్ ను ఆమోదించింది

• తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు-1956 సవరణ బిల్లును ఆమోదించింది

• ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు-1972కు సవరణ బిల్లును ఆమోదించింది

• కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది

• కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది

• 17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది

కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం తీసుసుకోనున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 07, 2020 10:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).