CM KCR Attacks PM Modi: 2024లో ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది టీఆర్ఎస్ జెండానే, దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి, నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్ (Nizamabad) పంట కాలువల్లో నీళ్లు పారాలా?.. మతపిచ్చి మంటలతో రక్తాలు పారాలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని 'సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

CM KCR Attacks PM Modi: 2024లో ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది టీఆర్ఎస్ జెండానే, దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి, నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
CM KCR

Hyd, Sep 5: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం (CM K Chandrasekhar Rao) ప్రారంభించారు. అనంతరం, టీఆర్‌ఎస్‌ తలపెట్టిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రధాని మోదీపై (CM KCR Attacks PM Modi) మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ (Nizamabad) పంట కాలువల్లో నీళ్లు పారాలా?.. మతపిచ్చి మంటలతో రక్తాలు పారాలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనించాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేశాము. సింగూరు నీళ్లు రాకుండా కుట్ర చేశారు. సింగూరు కాలువల్లో​ నీళ్లు పారాలా?. మతపిచ్చి మంటలతో రక్తం పారాలా?. కాళేశ్వరంతో​ నిజామాబాద్‌లో ప్రతీ గుంటకూ నీళ్లు అందుతున్నాయి. దేశంలో 24 గంటలు విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో​ దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చిన రాష్ట్రం మనది. గతంలో రూ. 200 పెన్షన్‌ ఇస్తే ఇప్పుడు రూ. 2వేలు ఇస్తున్నాము.

మునుగోడులో ముమ్మాటికీ గెలుపు మాదే! బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్న సీఎం కేసీఆర్, ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన, సర్వేల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోందన్న సీఎం కేసీఆర్

మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని అంటున్నారు. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.. ఇక రైతుల భూములే మిగిలాయి. ప్రధాని మోదీ, కార్పొరేట్‌ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి. రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. బ్యాంకులకు మోసం చేసిన వారికి రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొట్టండి. ఎమ్మెల్యేలను కొనేవి ప్రభుత్వాలా?. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. దేశం కోసం పిడికిలి బిగించాలి. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఒక్క రంగానైనా బాగు చేశారా?. దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయాలుండాలి.

ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది మన జెండానే. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నన్ను దేశ రాజకీయాల్లోని రావాలని కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాము. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్‌ నుంచే ప్రారంభిస్తాను. 2024లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్‌ ఇస్తాము’ అని స్పష్టం చేశారు.

నిజామాబాద్లో అద్భుతమైన కలెక్టరేట్ భవనం నిర్మించుకున్నామన్నారు. నాటి నేతలు చిన్న పొరపాటు చేస్తే మనం 60 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మనం ముందుకు పోదామా?.. మీ అందరి ఆశీస్సులతో జాతీయ రాజకీయాలను ప్రారంభిస్తున్నా.. అన్ని రంగాల్లో విఫలమైన కేంద్రం ఏం మంటలు పెడుతుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవు. దళిత బంధు (Dalit Bandhu) తెలంగాణలో మాత్రమే ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ తెలంగాణ (Telangana)లో మాత్రమే ఇస్తున్నామని తెలిపారు.

ప్రధాని మోదీ విమానాలు, రైల్వేలు, బ్యాంకుల అన్ని అమ్మాడు. మిగిలింది రైతుల దగ్గర ఉన్నా భూమి మాత్రమే. మోటార్లకు మీటర్లు పెడితే భరించలేక మనం వ్యవసాయం మానేయాలి. అప్పుడు రైతుల దగ్గర భూములు లాక్కోవాలనేదే కేంద్రం యోచన. రైతులు భూములు కొనేందుకు అప్పుడు కార్పొరేట్ సంస్థలు వస్తాయి. వ్యవసాయాన్ని ఆపేసి రైతుల భూములు కొట్టేయాలనేదే కుట్ర. తెలంగాణ సాధనకు అనాడు నేను ఒక్కడినే కదిలాను.. అప్పుడు నా వెంట మీరంతా నడిచారు. ఇప్పుడు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలంటున్న కుట్రలను తరిమికొట్టాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

(The above story first appeared on LatestLY on Sep 05, 2022 06:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).