Telangana: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్, సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
సింగరేణి ఉద్యోగులకు తెలంగాన సీఎం కేసీఆర్ (CM KCR) దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు (Singareni employees) చెల్లించాలని సీఎం ఆదేశించారు.
Hyd, Sep 28: సింగరేణి ఉద్యోగులకు తెలంగాన సీఎం కేసీఆర్ (CM KCR) దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు (Singareni employees) చెల్లించాలని సీఎం ఆదేశించారు. అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది.
(The above story first appeared on LatestLY on Sep 28, 2022 03:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

