Telangana CM KCR: జూన్ 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. కాగా.. ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలచేత ఈ నెల 30 తేదికి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న, ఇవ్వాళ జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహిస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా వుండడం... వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30 కి మార్చడం జరిగింది. జూన్ 30 నాడు నూతనంగా నిర్మితమైన ఆసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.
జూన్ 30న నూతనంగా నిర్మించిన అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అదే రోజు గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయం. pic.twitter.com/T1prTPkBQ8
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2023
(The above story first appeared on LatestLY on Jun 24, 2023 03:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

