Telangana: ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్, క్వాష్ పిటిష‌న్‌ను కొట్టివేసిన ధర్మాసనం, ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి నేపథ్యంలో కేసు నమోదు

హైదరాబాదు, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌తో పాటు త‌న కుమారుడిపై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రఘురామ‌రాజు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు (TS High Court) కొట్టివేసింది.

Telangana: ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్, క్వాష్ పిటిష‌న్‌ను కొట్టివేసిన ధర్మాసనం, ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి నేపథ్యంలో కేసు నమోదు
High Court of Telangana | (Photo-ANI)

Hyd, July 8: నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు (Raghu Rama Krishna Raju) తెలంగాణ హైకోర్టులో గ‌ట్టి షాక్ త‌గిలింది. హైదరాబాదు, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌తో పాటు త‌న కుమారుడిపై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రఘురామ‌రాజు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు (TS High Court) కొట్టివేసింది. త‌న కుమారుడు భ‌ర‌త్‌తో క‌లిసి ర‌ఘురామ‌రాజు సంయుక్తంగా దాఖ‌లు చేసిన ఈ పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.

హైద‌రాబాద్‌లోని రఘురామకృష్ణరాజు ఇంటి సమీపంలో విధి నిర్వహణలో వున్న ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై.. రఘురామ తనయుడు, భద్రతా సిబ్బంది దాడికి దిగార‌న్న ఆరోప‌ణ‌ల‌పై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ర‌ఘురామ‌రాజు, ఆయ‌న కుమారుడు భ‌ర‌త్‌, ర‌ఘురామ‌రాజుకు భ‌ద్ర‌త కోసం ప‌నిచేస్తున్న ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా గ‌చ్చిబౌలి పోలీసులు కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

రఘురామ సిబ్బంది కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న వీడియో బయట పెట్టిన ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయ‌డానికి సిగ్గు లేదా అంటూ ట్వీట్

ఈ వ్య‌వ‌హారంలో కేసులు న‌మోదైన ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఇప్పటికే స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.ఈ కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ నిందితులుగా ఉన్నారు.

(The above story first appeared on LatestLY on Jul 08, 2022 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).