రెక్కీ ఆరోప‌ణ‌ల‌తో తనపై రఘురామకృష్ణరాజు సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇప్ప‌టికే ర‌ఘురామ‌రాజుపై హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా...తాజాగా కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న వీడియోను వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి విడుద‌ల చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయ‌డానికి సిగ్గు లేదా? అంటూ ర‌ఘురామ‌రాజును పేరు ప్రస్తావించకుండా ప్ర‌శ్నించిన సాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కూడిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కే దాడికి సంబంధించిన వీడియోను సాయిరెడ్డి జ‌త చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో కానిస్టేబుల్‌ను ఎత్తి కారులో వేసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)