Telangana Horror: చికెన్ బదులు వంకాయ కూర వండిందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మరో ఘటనలో పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య
మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి చికెన్ వండాలని భర్త..భార్యకు చెప్పాడు.
మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి చికెన్ వండాలని భర్త..భార్యకు చెప్పాడు. అయితే ఆమె వంకాయ కూర వండటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆవేశంలో భార్య గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరో ఘటనలో పెళ్లి అయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో పళ్లిపట్టు యూనియన్ రామసముద్రం పంచాయతీ వీజీఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన రవి కుమారుడు ముత్తు(25) జేసీబీ డ్రైవర్. ఇతనికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేంద్రన్ కుమార్తె అను(22)తో జూన్ 29న గ్రామంలోని వరుడు ఇంట్లో వివాహం జరిగింది.
పది రోజుల వ్యవధిలో ఏం జరిగిందో కానీ మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న గదిలో అను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేకువజామున లేచిన ముత్తు భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. పొదటూరుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహమైన పది రోజులకే నవవధువు ఆత్మహత్యకు సంబందించి తిరుత్తణి ఆర్డీఓ విచారణ చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 13, 2023 03:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

