Telangana Shocker: ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న వదినా మరదళ్లు, సీన్ కట్ చేస్తే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుసకు వదినా మరదళ్లు ప్రేమికులుగా మారి పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Shocker: ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న వదినా మరదళ్లు, సీన్ కట్ చేస్తే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Representational Image (Photo Credits: File Image)

Hyd, Mar 16: మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుసకు వదినా మరదళ్లు ప్రేమికులుగా మారి పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. అంజలి, మహేశ్వరి ఇద్దరూ వరుసకు వదినా మరదళ్లు. వీరిలో మహేశ్వరికి చిన్నతనం నుంచి అబ్బాయిల లక్షణాలు ఉండేవి. ఈ క్రమంలోనే వరుసకు మరదలు అయిన అంజలిని మహేశ్వరి ఇష్టపడింది. అంజలి కూడా మహేశ్వరి ప్రేమించింది. ఇద్దరి మనసులు కలవడంతో పెండ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజే విద్యార్థిని ఆత్మహత్య, హన్మకొండలో హాస్టల్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న ఇంటర్ స్టూడెంట్ నాగజ్యోతి

దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఒక రూం అద్దెకు తీసుకుని కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.అయితే వీరిద్దరూ బుధవారం రాత్రి రామకృష్ణాపూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిద్దరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అంజలి మృతిచెందింది. మహేశ్వరి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.

ముంబైలో దారుణం, కూతురు ఇంట్లోనే శవమై కనిపించిన తల్లి, ట్యాంక్‌లోని స్టీల్‌ బాక్స్‌లో మాంసం, ఎముకల ముక్కలు, కూతురును అరెస్ట్ చేసిన పోలీసులు

ఇటీవల మహేశ్వరితో అంజలి సరిగ్గా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Mar 16, 2023 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).