COVID in TS: అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించే పనిలో తెలంగాణ అధికార యంత్రాగ్నం నిమగ్నం, రాష్ట్రంలో కొత్తగా మరో 574 పాజిటివ్ కేసులు నమోదు

K లో SARS-CoV-2 (VUI-20212/01) యొక్క కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తిని నివారణ మరియు కట్టడి కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.....

COVID in TS: అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించే పనిలో తెలంగాణ అధికార యంత్రాగ్నం నిమగ్నం, రాష్ట్రంలో కొత్తగా మరో 574 పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, December 24: UK లో SARS-CoV-2 (VUI-20212/01) యొక్క కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తిని నివారణ మరియు కట్టడి కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యుకె నుండి దాదాపు 1,500 మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిసింది. ప్రతి ప్రయాణికుడిని ట్రాక్ చేస్తూ నేరుగా వారు ఉన్న చోటుకే వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అందుకనుగుణంగా చికిత్స అందేందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో 44,516 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 574 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 666 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 66,11,118  మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 283,556కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 109 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 48, మేడ్చల్ నుంచి 42, వరంగల్ అర్బన్ నుంచి 34 మరియు కరీంనగర్ నుంచి 35 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,524కు పెరిగింది.

అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 384 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 275,217 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,815 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Dec 24, 2020 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).