COVID in TS: తెలంగాణలో 2 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, రాష్ట్రంలో కొత్తగా 101 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1842గా ఆక్టివ్ కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో ప్రజలు ఇప్పుడు కరోనాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా టీకాల వినియోగం జరిగింది.....

COVID in TS: తెలంగాణలో 2 లక్షలకు పైగా  హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, రాష్ట్రంలో కొత్తగా 101 కోవిడ్ కేసులు నమోదు,  ప్రస్తుతం 1842గా ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak| (Photo Credits: IANS)

Hyderabad, February 8: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో ప్రజలు ఇప్పుడు కరోనాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా టీకాల వినియోగం జరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 2,09,104 మంది కోవిడ్ నివారణ టీకా వేయించుకున్నారు.

ఇక కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 18,252 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 101 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 478 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,95,682కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 5 మరియు రంగారెడ్డి నుంచి 10  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,611కు పెరిగింది. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 197 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,92,229 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1842 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Feb 08, 2021 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).