COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 118 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ఇప్పటికీ 2 వేలకు పైగా కోవిడ్ ఆక్టివ్ కేసులు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్, టీకాలతో ఎలాంటి ప్రమాదం లేదని పునరుద్ఘాటన

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు 17,686 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 118 మందికి పాజిటివ్ అని తేలింది.....

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 118 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ఇప్పటికీ 2 వేలకు పైగా కోవిడ్ ఆక్టివ్ కేసులు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్, టీకాలతో ఎలాంటి ప్రమాదం లేదని పునరుద్ఘాటన
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, February 1: తెలంగాణలో కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ఆరోగ్య సిబ్బంది టీకా అందుకున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది, అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రాష్ట్రంలో  ముగ్గురు చనిపోవడం కలవరపెడుతోంది. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఈ ముగ్గురు ఇతర అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు కానీ, వ్యాక్సిన్ తో సంబంధం లేదని చెప్తున్నారు.

ఇదిలా ఉంటే,  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మాత్రం ఇంకా ఆగడం లేదు.  నిన్న రాత్రి 8 గంటల వరకు 17,686 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 118 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 525 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,94,587కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 26 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 13, మేడ్చల్, కరీంనగర్ మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి చెరో 8 కేసుల చొప్పున నమోదయ్యాయి.  రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,601కు పెరిగింది. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 264 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 290,894 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,092 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Feb 01, 2021 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).