TS's COVID Report: తెలంగాణలో నేడు, రేపు కొనసాగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో 146 కోవిడ్ కేసులు నమోదు, 1825గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేడు కొనసాగి శుక్రవారంతో ముగియనుంది. రేపటితో రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ ముగుస్తుంది. బుధవారం నాటికి కేవలం 37 శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు....
Hyderabad, February 11: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేడు కొనసాగి శుక్రవారంతో ముగియనుంది. రేపటితో రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ ముగుస్తుంది. బుధవారం నాటికి కేవలం 37 శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 2,57,940 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత మరోసారి హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోస్ టీకా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను గమనిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 29,755 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 146 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 640 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,96,134కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 9 మరియు రంగారెడ్డి నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ మరణాలేమి లేవు, రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మరణాల సంఖ్య 1,613గా ఉంది. బుధవారం సాయంత్రం వరకు మరో 118 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,92,696 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1825 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 11, 2021 10:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

