Telangana: తెలంగాణలో కొత్తగా మరో 1590 పాజిటివ్ కేసులు నమోదు, మళ్లీ హైదరాబాద్ నుంచే అత్యధికంగా 1277 కేసులు, రాష్ట్రంలో 24 వేలకు చేరువైన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
గత 24 గంటల్లో 5,290 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది...
Hyderabad, July 5: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కూడా భారీ స్థాయిలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 1590 మంది కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 23,902 కి చేరుకుంది.
హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు, నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,277 మందికి పాజిటివ్ అని తేలింది.
హైదరాబాద్ ప్రభావం సమీపంలోని ప్రాంతాలపై కూడా ఉంది. ఈరోజు మేడ్చల్ నుంచి 125 కేసులు నమోదయ్యాయి, అటు తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 82 కేసులు రాగా, సుర్యాపేట నుంచి 23, సంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాల నుంచి 19 చొప్పున మరియు నల్గొండ జిల్లా నుంచి 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Bulletin:

మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 295 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో పెద్ద మొత్తంలో మరో 1,166 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 12,703 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,904 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. #WhereIsKCR: సీఎం కేసీఆర్ ఎక్కడ?
గత 24 గంటల్లో 5,290 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jul 05, 2020 10:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

