COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1842 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,06,091కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 761కు పెరిగిన కరోనా మరణాలు
గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 761 కు పెరిగింది, ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Hyderabad, August 24: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 36,282 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1842 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 895 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,68,121 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,06,091కి చేరుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉధృతి చాలా వరకు తగ్గింది. జీహెచ్ఎంసీలో క్రమంగా కేసులు తగ్గుతుండటం విశేషం. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 373 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్, సంగారెడ్డిలో కూడా కొత్తగా నమోదయ్యే కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్న సాయంత్రం వరకు మేడ్చల్ నుంచి నమోదైన కేసులు 32గా ఉండగా, సంగారెడ్డి నుంచి 50 కేసులు నిర్ధారణయ్యాయి.
మరోవైపు పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిజామాబాద్ నుంచి 158, కరీంనగర్ నుంచి 134, సూర్యాపేట నుంచి 113 మరియు రంగారెడ్డి నుంచి 109 కేసుల చొప్పున నివేదించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

ఆగష్టు 23న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 761 కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1825 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 82,411 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 24, 2020 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

