Corona in Telangana: తెలంగాణలో 30 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1924 కేసులు నమోదు, రాష్ట్రంలో 324కు పెరిగిన కరోనా మరణాలు
గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 324 కు పెరిగింది...
Hyderabad, July 8: చూస్తూచూస్తూనే తెలంగాణలో కొవిడ్ బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1924 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 29,536కి చేరుకుంది.
హాట్‌స్పాట్ హైదరాబాద్‌లో మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన కేసుల్లో కూడా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1590 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఈరోజు రంగారెడ్డి నుంచి 99 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 43 కేసులు వచ్చాయి. అటుఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. వరంగల్ రూరల్ నుంచి 19, వరంగల్ అర్బన్ నుంచి 7 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కూడా మరో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Bulletin:

మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 324 కు పెరిగింది. మానవత్వాన్ని చంపేసిన కరోనా భయం, అందరూ చూస్తుండగా అసహాయ స్థితిలో యువకుడు మృతి
అలాగే, బుధవారం సాయంత్రం నాటికి మరో 992 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 17,279 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది
గత 24 గంటల్లో 6,363 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,34,801 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jul 08, 2020 10:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

