young men sudden demise in Hyderabad Local people deny help to him with Coronavirus Fear (Photo-Twitter)

Hyderabad, July 8: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో (ECIL Cross Roads) బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు అందరూ చూస్తుండగానే రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు (Sudden Demise) విడిచాడు. 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. యువకుడు అప్పటికే మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్‌గా తెలిసింది. కరోనా శవాన్ని పీక్కుతింటున్న కుక్క, హైదరాబాద్ నగరం నుంచి ఒళ్లు గగుర్పొడిచే వీడియో బయటకు, సనత్ నగర్ శ్మశానవాటికలో అమానవీయ ఘటన

కాగా మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని స్థానికంగా ఉండే జీనియా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జీనియా ఆస్పత్రి సిబ్బంది వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యువకుడిని తీసుకుని కుటుంబ సభ్యులు బయటికొచ్చారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్దామని ఆటో కోసం చూస్తుండగా యువకుడు అనూహ్యంగా కిందపడి మృత్యువాత పడ్డాడు.

Here's Videos

అయితే ఈ సమయంలో మానవత్వం అనేది కరువయింది. కరోనా వైరస్ మానవత్వాన్ని చంపేసింది. కిందపడిన పృథ్వీరాజ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం వారి కుటుంబ సభ్యులు ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయాలతో (Coronavirus Fear) సాటిమనిషిని పట్టించుకోవడం మానేశారని వాపోయారు.