Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్ష 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 846కు పెరిగిన కరోనా మరణాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 477 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్, రంగారెడ్డిలో కూడా కొత్తగా నమోదయ్యే కేసులు పెరిగాయి. నిన్న సాయంత్రం వరకు రంగారెడ్డి నుంచి నమోదైన కేసులు 234గా ఉండగా, మేడ్చల్ నుంచి 192 కేసులు నిర్ధారణయ్యాయి....

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్ష 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 846కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, September 2 :  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 59,421 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,892  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 2,255 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,83,267 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,30,589కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 477 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్,  రంగారెడ్డిలో కూడా కొత్తగా నమోదయ్యే కేసులు పెరిగాయి. నిన్న సాయంత్రం వరకు రంగారెడ్డి నుంచి నమోదైన కేసులు 234గా ఉండగా, మేడ్చల్ నుంచి 192 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది,   పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిన్న నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరీంనగర్ నుంచి 152, ఖమ్మం నుంచి 128, వరంగల్ అర్బన్ నుంచి 116, నిజామాబాద్ నుంచి 110, సిద్ధిపేట మరియు సూర్యాపేట జిల్లాల నుంచి చెరో 108 కేసులు, జగిత్యాల నుంచి 102 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
 Telangana's COVID19 Bulletin:
Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 846 కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 2,240 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 97,402 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,341 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Sep 02, 2020 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).