TS COVID Report: తెలంగాణలో కొత్తగా 405 కోవిడ్ కేసులు మరియు 3 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 577 మంది రికవరీ, ప్రస్తుతం 7,093కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

సాయంత్రం వరకు మరో 577 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,41,847 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

TS COVID Report: తెలంగాణలో కొత్తగా 405 కోవిడ్ కేసులు మరియు 3 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 577 మంది రికవరీ, ప్రస్తుతం 7,093కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, August 16: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాలుగా ప్రతిరోజు 4 నుంచి 5 వందల మధ్య కేసులు నమోదవుతున్నాయి, 2 నుంచి 3 మరణాలు నమోదవుతున్నాయి. మరియు 5 నూంచి 6 వందల మధ్య రికవరీలు నమోదవుతున్నాయి. నమోదయ్యే కేసుల కంటే, రికవరీల సంఖ్య స్వల్పంగా ఎక్కువగా ఉంటుండటంతో ఆక్టివ్ కేసులు మెల్లిమెల్లిగా తగ్గుతూపోతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,262 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 405 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 843 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,52,785కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 67 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 32, వరంగల్ అర్బన్ నుంచి 36 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,845కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 577 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,41,847 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 16, 2021 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).