COVID19 in TS: తెలంగాణలో 79 శాతం కోవిడ్19 పేషెంట్లకు లక్షణాలేమి లేవు; రాష్ట్రంలో కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదు, 569 మంది రికవరీ, 7 వేల దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
సాయంత్రం వరకు మరో 569 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,42,416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు...
Hyderabad, August 17: తెలంగాణలో నమోదవుతున్న రోజూవారీ కోవిడ్19 కేసుల్లో గణనీయమైన మార్పులేమి లేవు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 79.8 శాతం మందికి కరోనా లక్షణాలేమి లేవని, కేవలం 20.2 శాతం మందికి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు ఇప్పుడు 98.34 శాతంగా మైరుగైన స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 87,230 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 417 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,109 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,53,202కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,847కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 569 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,42,416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 17, 2021 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

