Corona in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఇంకా ఆక్టివ్; రాష్ట్రంలో కొత్తగా 494 కోవిడ్ కేసులు నమోదు మరియు 621 మంది రికవరీ

కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల పాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ఆక్టివ్ గా ఉందని, ఈ నేపథ్యంలో వ్యాప్తి వేగంగా జరిగి మళ్లీ కోవిడ్ కేసులు అమాంతగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు...

Corona in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఇంకా ఆక్టివ్; రాష్ట్రంలో కొత్తగా 494 కోవిడ్ కేసులు నమోదు మరియు 621 మంది రికవరీ
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, August 10: కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల పాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ఆక్టివ్ గా ఉందని, ఈ నేపథ్యంలో వ్యాప్తి వేగంగా జరిగి మళ్లీ కోవిడ్ కేసులు అమాంతగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని, అంతేకాకుండా వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.

ఇటీవల కాలంగా తెలంగాణలో కోవిడ్ యాక్టివ్ కేసుల్లో సాధారణ తగ్గుదల ఉన్నప్పటికీ, రోజూవారీ కోవిడ్ ఇన్‌ఫెక్షన్లలో మాత్రం గణనీయమైన మార్పులేమి లేవు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి మరియు వరంగల్ (పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు) సహా కనీసం ఎనిమిది జిల్లాలు ప్రతిరోజూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కోవిడ్ ఇన్ఫెక్షన్లను నివేదిస్తూనే ఉన్నట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,037 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 494 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,544 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,50,353కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 51, వరంగల్ అర్బన్ నుంచి 45 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,831కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 621 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,38,410 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,112 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 10, 2021 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).