COVID in TS: తెలంగాణలో కొత్తగా 808 కోవిడ్ కేసులు మరియు 07 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 1,061 మంది కరోనా నుంచి రికవరీ

తెలంగాణలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు 62 శాతం మంది ఉన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషనే కీలకం కానుంది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే 82 శాతం వ్యాక్సిన్ జరగగా...

COVID in TS: తెలంగాణలో కొత్తగా 808 కోవిడ్ కేసులు మరియు 07 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 1,061 మంది కరోనా నుంచి రికవరీ
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, July 5: దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కోవిడ్ నియంత్రణలోకి వచ్చింది, రికవరీలు పెరుగుతున్నాయి. అయితే ఆగస్టు థర్డ్ వేవ్ రావొచ్చు అంతేకాకుండా ఇది సెప్టెంబరులో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)కు సంబంధించిన ఒక నివేదిక అంచనా వేసింది. అయితే, ఇది పూర్వ పరిస్థితులను బట్టి అంచనా వేసిన ట్రెండ్ మాత్రమే అని తమ నివేదికలో పేర్కొంది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది, అయితే నగర ప్రాంతాల్లో అనేక చోట్ల వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ మిగతా చోట్ల క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతోంది. ఇప్పటికీ ఫస్ట్ డోస్ పూర్తయి, సెకండ్ డోస్ కోసం వేచి చూసే వారు ఎంతో మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 35 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరగగా, ఇందులో 6.4 కోట్ల మందికి మాత్రమే సెకండ్ డోస్ పూర్తి అయినట్లు తెలుస్తుంది.

ఇక, తెలంగాణలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు 62 శాతం మంది ఉన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషనే కీలకం కానుంది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే 82 శాతం వ్యాక్సిన్ జరగగా, చాలా జిల్లాల్లో అయితే ఇప్పటివరకు కేవలం 11 శాతం మాత్రమే జరగటం గమనార్హం.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 808 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 729 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,27,498కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 62, ఖమ్మం నుంచి 59, కరీంనగర్ నుంచి 58 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,698కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 1,061 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,12,096 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jul 05, 2021 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).