Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను తప్పించబోయి ప్రైవేటు బస్సు బోల్తా, 40 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హైదరాబాద్‌ వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు రామగుండం తిరుగు పయనమైంది.

Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను తప్పించబోయి ప్రైవేటు బస్సు బోల్తా, 40 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
Accident (Photo-Wikimedia Commons)

Telangana Road Accident: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హైదరాబాద్‌ వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు రామగుండం తిరుగు పయనమైంది. ఈ క్రమంలో సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్దకు రాగానే ఆటోను తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 25 మందికి తీవ్రగాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు బస్సులు ఢీ.. 10 మంది దుర్మరణం.. మరో 8 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం

మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ మహేశ్‌, సీఐ జగదీశ్‌, పోలీసు సిబ్బంది పరిశీలించారు. క్షతగాత్రులను సుల్తానాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

(The above story first appeared on LatestLY on Jun 26, 2023 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).