Mahabubnagar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టిన డీసీఎం వాహనం, చిన్న పిల్లలతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారం వారం సంతలో సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

Mahabubnagar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టిన డీసీఎం వాహనం, చిన్న పిల్లలతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి
Peru Road Accident Accident Representative Image

బాలనగర్, జనవరి 5: మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారం వారం సంతలో సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.

షాకింగ్ వీడియో ఇదిగో, గీతం యూనివర్సిటీలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్‌ విద్యార్ధిని

డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

(The above story first appeared on LatestLY on Jan 05, 2024 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).